మీన రాశి - January జనవరి 2025 రాశి ఫలములు
Meena Rashi - Rashiphalalu January 2025
January జనవరి నెలలో మీన రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధ గోచార ఫలములు
మీనరాశి, మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశిచక్రంలో పన్నెండవ రాశి. ఇది 330° నుంచి 360 ° ని కలిగి ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్ర (4 వ పాదం), ఉత్తరాభాద్ర నక్షత్ర (4 పాదాలు), రేవతీ నక్షత్ర (4 పాదాలు) కింద జన్మించిన వారు మీన రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బృహస్పతి.
మీన రాశి - జనవరి నెల రాశి ఫలాలు
జనవరి 2025 నెలలో మీన రాశి గ్రహ గోచారం
సూర్యుడు
మీ రాశికి 6వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈనెల 14వ తేదీ వరకు 10వ ఇల్లైన ధనస్సు రాశిలో సంచరించి, ఆ తర్వాత 11వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
బుధుడు
మీ రాశికి 4వ మరియు 7వ ఇండ్ల అధిపతి అయిన బుధుడు ఈనెల 4వ తేదీ వరకు 9వ ఇళ్లైన వృశ్చిక రాశిలో సంచరించి, ఆ తర్వాత 10వ ఇల్లైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు, తిరిగి ఈ నెల 24వ తేదీన 11వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
శుక్రుడు
మీ రాశికి 3వ మరియు 8వ ఇండ్లకు అధిపతి అయిన శుక్రుడు ఈనెల 28వ తేదీ వరకు 12వ ఇల్లైన కుంభరాశిలో సంచరించి, ఆ తర్వాత 1వ ఇల్లు, తన ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.
కుజుడు
మీ రాశికి 2వ మరియు 9వ ఇండ్లకు అధిపతి అయిన కుజుడు, వక్రగతుడై ఈ నెల 21వ తేదీ వరకు తన నీచ రాశి మరియు 5వ ఇల్లు అయిన కర్కాటక రాశిలో సంచరించి, ఆ తర్వాత 4వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.
గురుడు
మీ రాశ్యాధిపతి మరియు 10వ ఇంటి అధిపతి అయిన గురువు వక్ర గతుడై ఈ నెలలో కూడా 3వ ఇల్లైన వృషభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
శని
మీ రాశికి 11వ మరియు 12వ ఇండ్లకు అధిపతి అయిన శని ఈ నెలలో కూడా 12వ ఇల్లైన కుంభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
రాహువు
రాహువు 1వ ఇల్లైన మీన రాశిలో ఈ నెల కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
కేతువు
కేతువు 7వ ఇల్లైన కన్య రాశిలో ఈ నెలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
జనవరి 2025 నెలలో ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది?
ఈ నెలలో మీ పని విజయవంతం అవుతుంది. ఈనెల ప్రథమార్ధంలో వృత్తిపరంగా మీరు మంచి గుర్తింపు పొందుతారు. మీరు అనుకున్న విధంగా పదోన్నతి లేదా పదవిలో మార్పు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా పూర్తి కాకుండా ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. మీ సహోద్యోగుల సహకారం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభను మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది, ఇది మీ కెరీర్‌లో మెరుగుదలకు దారితీస్తుంది. ద్వితీయార్థంలో మీరు ఆర్థికంగా కూడా లాభపడతారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో అనుకూల ఫలితం లభిస్తుంది. ఈనెల ప్రధమార్ధంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.
జనవరి 2025 నెలలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?
ఈ నెల ఆర్థికంగా సాధారణ స్థాయిలో ఉంటుంది. ఆదాయం మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, ఖర్చులు అధికంగా ఉండటం వల్ల పొదుపు చేయడం కష్టమవుతుంది. అనవసర వాగ్దానాలు చేయకుండా ఉండటం మంచిది, ఎందుకంటే అవి భవిష్యత్తులో సంబంధాల్లో సమస్యలను కలిగించవచ్చు. ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గటం వలన మీరు డబ్బు పొదుపు చేయగలుగుతారు మరియు గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ద్వితీయార్థంలో ఆ పని చేయటం మంచిది.
జనవరి 2025 నెలలో కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది?
కుటుంబ జీవితం సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్ధంలో పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని తెస్తుంది. ఈనెలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లటం కానీ లేదా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేస్తారు. అంతేకాకుండా మీరు చేసే పనుల్లో మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు విజయాలనిస్తుంది. ద్వితీయార్థంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లోపించడం కానీ ఆవేశం కారణంగా గొడవలు ఏర్పడటం కానీ జరగవచ్చు. అయితే సూర్యుని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్య తొందరలో పరిష్కారం అవుతుంది.
జనవరి 2025 నెలలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది?
ఈ నెల ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. గతంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారు, ఈ నెలలో మెరుగుదల చూడగలరు. సాధారణ ఆరోగ్య నిబంధనలను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈనెల చివరి వారంలో గుండె, ఊపిరితిత్తులు లేదా రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే సూర్యుని గోచారం అనుకూలంగా ఉండడంతో ఈ సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. ఆవేశానికి లోను కాకుండా ఉండటం మరియు వీలైనంతవరకు ప్రాణాయామం లాంటి పద్ధతులు పాటించడం వలన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
జనవరి 2025 నెలలో వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది?
వ్యాపారస్తులకు ఈ నెల మంచి వృద్ధి సూచిస్తుంది. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. అయితే, ఆర్థికంగా పెట్టుబడులు ఆదాయాన్ని మించి ఉండే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగడం అవసరం. ద్వితీయార్థంలో ఆదాయం పెరిగినప్పటికీ మీ వ్యాపార సంస్థకు సంబంధించి భవనాలకు లేదా వాహనాలకు మరమ్మత్తులు చేయాల్సి రావటం దాని కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం మరియు వ్యాపారం గురించి ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం జరగవచ్చు. ముఖ్యంగా చివరి వారంలో వ్యాపార పరంగా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
జనవరి 2025 నెలలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది?
విద్యార్థులకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. బుధ గ్రహం సంచారం వారి విద్యలో విజయాన్ని అందిస్తుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది మరియు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవడానికి ఇది ఉత్తమ సమయం. ఈనెల చివరి వారంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడటం దాని కారణంగా ఏకాగ్రత తగ్గటం జరగవచ్చు. ఈ సమయంలో ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండటం వలన చదువులో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడవచ్చు.
మీకు వీలైతే ఈ పేజీ లింకును లేదా https://www.onlinejyotish.com ను మీ ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన వాటిలో షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సాయం మరిన్ని ఉచిత జ్యోతిష సేవలు అందించటానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కృతజ్ఞతలు
Daily Horoscope (Rashifal):
English, हिंदी, and తెలుగు
January, 2025 Monthly Horoscope (Rashifal) in:
Click here for Year 2025 Rashiphal (Yearly Horoscope) in
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.
Free Astrology
Newborn Astrology, Rashi, Nakshatra, Name letters
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in English, Hindi, Telugu, Kannada, Marathi, Gujarati, Tamil, Malayalam, Bengali, and Punjabi, French, Russian, and German. Languages. Click on the desired language name to get your child's horoscope.
Free Vedic Horoscope with predictions
Are you interested in knowing your future and improving it with the help of Vedic Astrology? Here is a free service for you. Get your Vedic birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, Yogas, doshas, remedies and many more. Click below to get your free horoscope.
Get your Vedic Horoscope or Janmakundali with detailed predictions in
English,
Hindi,
Marathi,
Telugu,
Bengali,
Gujarati,
Tamil,
Malayalam,
Punjabi,
Kannada,
Russian, and
German.
Click on the desired language name to get your free Vedic horoscope.