OnlineJyotish


జనవరి 2025 రాశి ఫలాలు - కన్యా రాశి - జనవరి నెల కన్యా రాశి జాతకం


కన్యా రాశి January జనవరి 2025 రాశి ఫలములు

Kanya Rashi - Rashiphalalu January 2025

January జనవరి నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం

image of Kanya Rashiకన్యారాశి, రాశిచక్రంలో ఆరవ రాశి. కన్యారాశి రెండవ-అతి పెద్ద నక్షత్రసముదాయం. ఇది రాశిచక్రంయొక్క 150-180th డిగ్రీలను కలిగి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం (2, 3, 4 పాదాలు), హస్త నక్షత్రం (4 పాదాలు), చిత్తా నక్షత్రం (1, 2 పాదాలు) కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు.

కన్యా రాశి - జనవరి నెల రాశి ఫలాలు


జనవరి 2025 నెలలో కన్య రాశి గ్రహ గోచారం

సూర్యుడు
మీ రాశికి 12వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఈనెల 14వ తేదీ వరకు 4వ ఇల్లైన ధనస్సు రాశిలో సంచరించి, ఆ తర్వాత 5వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

బుధుడు
మీ రాశ్యాధిపతి మరియు 10వ ఇంటి అధిపతి అయిన బుధుడు ఈనెల 4వ తేదీ వరకు 3వ ఇళ్లైన వృశ్చిక రాశిలో సంచరించి, ఆ తర్వాత 4వ ఇల్లైన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు, తిరిగి ఈ నెల 24వ తేదీన 5వ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

శుక్రుడు
మీ రాశికి 2వ మరియు 9వ ఇండ్లకు అధిపతి అయిన శుక్రుడు ఈనెల 28వ తేదీ వరకు 6వ ఇల్లైన కుంభరాశిలో సంచరించి, ఆ తర్వాత 7వ ఇల్లు, తన ఉచ్ఛ రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.

కుజుడు
మీ రాశికి 3వ మరియు 8వ ఇండ్లకు అధిపతి అయిన కుజుడు, వక్రగతుడై ఈ నెల 21వ తేదీ వరకు తన నీచ రాశి మరియు 11వ ఇల్లు అయిన కర్కాటక రాశిలో సంచరించి, ఆ తర్వాత 10వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.

గురుడు
మీ రాశికి 4వ మరియు 7వ ఇండ్లకు అధిపతి అయిన గురువు వక్ర గతుడై ఈ నెలలో కూడా 9వ ఇల్లైన వృషభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

శని
మీ రాశి నుంచి 5వ మరియు 6వ ఇండ్లకు అధిపతి అయిన శని ఈ నెలలో కూడా 6వ ఇల్లైన కుంభ రాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

రాహువు
రాహువు 7వ ఇల్లైన మీన రాశిలో ఈ నెల కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

కేతువు
కేతువు 1వ ఇల్లైన కన్య రాశిలో ఈ నెలలో కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

ఫలితాలు

ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తి పరంగా కొంతమేరకు అనుకూలంగా ఉంటే, కుటుంబ పరంగా సాధారణ స్థితి కనిపిస్తుంది.



జనవరి 2025 నెలలో ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది?

వృత్తిపరంగా ఈ నెల ప్రథమార్ధం సామాన్యంగా ఉంటుంది ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్దంలో వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా తీరిక లేకపోవడం మరియు అసహనం ఎక్కువవటం జరగవచ్చు. అయితే ఇదే సమయంలో పదోన్నతి లేదా వృత్తిపరంగా కొంత అభివృద్ధి సాధ్యమవ్వటం వలన ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని భరించగలుగుతారు. ద్వితీయార్థంలో మీ మానసిక ఒత్తిడి మరియు పనిభారం తగ్గిపోతుంది, ముఖ్యంగా మూడో వారం నుంచి. మీ పై అధికారుల నుండి కొంత మద్దతు లభిస్తుంది. పని ఒత్తిడి తగ్గిపోవడం వల్ల మీ వ్యక్తిగత అభివృద్ధికి కొంత సమయం దొరుకుతుంది. కుజ గ్రహం 11వ ఇంటిపై సంచరించడం వల్ల మీరు చేపట్టిన పనులు విజయవంతం అవ్వడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీరు కష్టపడి పని చేయడానికి ధైర్యాన్ని ఇస్తుంది. మీరు స్వీయ అభివృద్ధికి కృషి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు.

జనవరి 2025 నెలలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ నెల ఆర్థిక పరంగా సాధారణ స్థాయిలో ఉంటుంది. పెద్దగా లాభాలు లేకపోయినా, నష్టాలు కూడా కనిపించవు. మూడో వారం నుండి ఆదాయంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పొదుపు అలవాటును కొనసాగించడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్నా, మూడో వారానికి తర్వాత చేయడం లాభదాయకం. ఈనెల ప్రథమార్ధంలో కుటుంబ విషయాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మరియు వాహనాలు లేదా ఇల్లు మరమ్మత్తు విషయంలో కొంత డబ్బు ఖర్చు పెడతారు. అయితే ద్వితీయార్థంలో ఆదాయంలో అభివృద్ధి లభించడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

జనవరి 2025 నెలలో కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ నెలలో కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది. ప్రధమార్ధంలో పని ఒత్తిడి కారణంగా పెరగటం దాని ప్రభావం కుటుంబ సభ్యులపై పడటం జరుగుతుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు కోపాన్ని తగ్గించుకోవడం మరియు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోవడం మంచిది. ద్వితీయార్థంలో పని ఒత్తిడి తగ్గటం వలన కుటుంబంలో కూడా సమస్యలు తగ్గుముఖం పడతాయి మరియు మీ పిల్లలు వారి రంగంలో విజయాలు సాధిస్తారు, ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మూడో వారం నుండి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ నెలలో మీ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఓర్పు, సహనం అవసరం.



జనవరి 2025 నెలలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ నెల ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నెల మొదటి భాగంలో కడుపు మరియు ఊపిరితిత్తులతో సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కానీ రెండో భాగంలో ఆరోగ్యం మెరుగుపడి, సమస్యల నుండి కోలుకుంటారు. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య పరంగా మంచిది. అవసరమైనంత వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.

జనవరి 2025 నెలలో వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది?

వ్యాపారస్తులకు ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్దంలో వ్యాపార అభివృద్ధికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ కొత్త నిర్ణయం తీసుకోవాలన్న మీ భాగస్వాముల నుంచి వ్యతిరేకత రావటం లేదా సరైన సమయానికి ఆర్థిక సహాయం అందకపోవటం కానీ జరగవచ్చు. ద్వితీయార్థంలో వ్యాపారం సాఫీగా సాగుతుంది, కానీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం కాదు. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. మొదటి రెండు వారాల్లో వ్యాపార భాగస్వాములతో కొన్ని చిన్న సమస్యలు తలెత్తవచ్చు, కానీ మూడో వారం నుండి మద్దతు పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసేముందు, ప్రతి విషయాన్ని పరిశీలించడం అవసరం.

జనవరి 2025 నెలలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది?

విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది. వారు చదువుల్లో మరియు పరీక్షల్లో మంచి ప్రతిభ చూపగలుగుతారు. బుధ గ్రహం 4వ మరియు 5వ ఇంటిపై సంచరించడం వల్ల వారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. పరీక్షలలో మంచి మార్కులు పొందాలంటే, కృషిని పెంచడం అవసరం. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సాధనాలు, మతపఠనం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థులకు మరింత లాభదాయకంగా ఉంటుంది.



మీకు వీలైతే ఈ పేజీ లింకును లేదా https://www.onlinejyotish.com ను మీ ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన వాటిలో షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సాయం మరిన్ని ఉచిత జ్యోతిష సేవలు అందించటానికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కృతజ్ఞతలు




Aries (Mesha Rashi)
Imgae of Aries sign
Taurus (Vrishabha Rashi)
Image of vrishabha rashi
Gemini (Mithuna Rashi)
Image of Mithuna rashi
Cancer (Karka Rashi)
Image of Karka rashi
Leo (Simha Rashi)
Image of Simha rashi
Virgo (Kanya Rashi)
Image of Kanya rashi
Libra (Tula Rashi)
Image of Tula rashi
Scorpio (Vrishchika Rashi)
Image of Vrishchika rashi
Sagittarius (Dhanu Rashi)
Image of Dhanu rashi
Capricorn (Makara Rashi)
Image of Makara rashi
Aquarius (Kumbha Rashi)
Image of Kumbha rashi
Pisces (Meena Rashi)
Image of Meena rashi
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Free Astrology

Free Vedic Horoscope with predictions

Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of Vedic Astrology? Here is a free service for you. Get your Vedic birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, Yogas, doshas, remedies and many more. Click below to get your free horoscope.
Get your Vedic Horoscope or Janmakundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  Russian, and  German.
Click on the desired language name to get your free Vedic horoscope.

Hindu Jyotish App

image of Daily Chowghatis (Huddles) with Do's and Don'tsThe Hindu Jyotish app helps you understand your life using Vedic astrology. It's like having a personal astrologer on your phone!
Here's what you get:
Daily, Monthly, Yearly horoscope: Learn what the stars say about your day, week, month, and year.
Detailed life reading: Get a deep dive into your birth chart to understand your strengths and challenges.
Find the right partner: See if you're compatible with someone before you get married.
Plan your day: Find the best times for important events with our Panchang.
There are so many other services and all are free.
Available in 10 languages: Hindi, English, Tamil, Telugu, Marathi, Kannada, Bengali, Gujarati, Punjabi, and Malayalam.
Download the app today and see what the stars have in store for you! Click here to Download Hindu Jyotish App