ఈ రోజు రాశిఫలం - దిన ఫలాలు
Telugu Rashi Phalalu - రోజువారి రాశి ఫలాలు
Daily Horoscope in Telugu - తెలుగు రాశి ఫలాలు
అది దిన పత్రికలో అయినా లేక టీవీల్లో అయినా మన తెలుగు వారిలో చాలామందికి ప్రతిరోజు సూర్యోదయంతో పాటుగా రోజువారీ పంచాంగం మరియు రాశి ఫలాలు చూడటం చాలాకాలం నుంచి అలవాటైన పని. . మన సంప్రదాయం ప్రకారం రోజు సూర్యోదయంతో ప్రారంభం అవుతుంది. అందుకే మన ఆన్ లైన్ జ్యోతిష్ డాట్ కాం (onlinejyotish.com) లో ఇచ్చే రోజువారి రాశి ఫలాలు లేదా దిన ఫలాలు స్థానిక సూర్యోదయ సమయానికి ప్రతిరోజు అప్ డేట్ అవుతాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు, ఆ రోజు సూర్యోదయ సమయానికి ఉన్న రాశి, నక్షత్రం మరియు ఇతర గ్రహస్థితుల ఆధారంగా ఈ ఫలితాలు రాయబడ్డాయి. ఈ రాశిఫలాలు మీరు పుట్టిన రాశి ఆధారంగా రూపొందించబడ్డాయి. ఒక వేళ మీ రాశి ఏదో తెలియకుంటే ఇక్కడ క్లిక్ చేసి, మీ పుట్టిన తేదీ, సమయం మరియు జన్మస్థల వివరాల ఆధారంగా మీ రాశి, నక్షత్రం తెలుసుకోవచ్చు. మీ పుట్టిన తేదీ, సమయం వివరాలు తెలియకుంటే ఇక్కడ క్లిక్ చేసి మీ పేరును బట్టి మీ రాశి ఏదనేది తెలుసుకోవచ్చు.
ఈ రోజు రాశి ఫలాలు, తేది: 15-01-2025
మేష రాశి
అశ్విని (4),
భరణి (4),
కృత్తిక (1వ పాదం)
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.
వృషభ రాశి
కృత్తిక (2,3, 4 పాదాలు),
రోహిణి (4),
మృగశిర (1, 2పాదాలు)
ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.
మిథునరాశి
మృగశిర (3,4 పాదాలు),
ఆరుద్ర(4),
పునర్వసు (1, 2, 3పాదాలు)
ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.
కర్కాటక రాశి
పునర్వసు (4వ పాదం),
పుష్యమి (4),
ఆశ్లేషా (4)
ఈ రోజు మీరు ఆశించిన కోరికలు నెరవేరడం, ఉన్నత పదవులు, విజయం, సుఖం, ఆనందం, కుటుంబ సౌఖ్యం వంటి శుభ ఫలితాలు పొందుతారు. బహుమతులు అందుకునే అవకాశం ఉంది.
సింహ రాశి
మఖ(4)
పుబ్బ(4),
ఉత్తర(1st పాదం)
ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.
కన్యారాశి
ఉత్తర (2, 3, 4 పాదాలు),
హస్త (4),
చిత్త(1, 2 పాదాలు)
ఈ రోజు మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం అవొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకోని విషయాలపై ఖర్చు చేయాల్సి వస్తుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.
తులా రాశి
చిత్త (3,4పాదాలు),
స్వాతి (4),
విశాఖ (1, 2, 3 పాదాలు)
ఇది మీ వ్యక్తిగత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే సమయం. మీ భావాలను, అభిప్రాయాలను ఎప్పటికన్నా స్వేచ్ఛగా, మనసు విప్పి వ్యక్తపరచడానికి ఇది మంచి తరుణం.
వృశ్చిక రాశి
విశాఖ (4వ పాదం),
అనురాధ (4),
జ్యేష్ట (4)
ఈ రోజు మీరు ధనలాభం, ఆనందం, శత్రువులపై విజయం, మంచి ఆరోగ్యం, స్నేహితులతో ఆనందం, మనసులోని కోరికలు నెరవేరడం వంటి శుభ ఫలితాలను అనుభవిస్తారు.
ధనూరాశి
మూల (4),
పూర్వాషాఢ (4),
ఉత్తరాషాఢ (1 పాదాలు)
ఇది మీ భావాలను వ్యక్తపరచడానికి సరైన సమయం. ఒకవేళ ఎవరైనా దీనిని ఇష్టపడకపోతే, వారితో మీ స్నేహాన్ని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ విషయంలో, మీరు మామూలు కంటే ఎక్కువ భావోద్వేగాలను అనుభవిస్తారు. అయితే, నచ్చినవారిని మీ సొంతం చేసుకోవాలని అనుకోకండి. వారి భావాలను కూడా గౌరవించండి.
మకర రాశి
ఉత్తరాషాఢ (2,3, 4పాదాలు),
శ్రవణం (4),
ధనిష్టా (1, 2పాదాలు)
ఇంట్లో సేదతీరి విశ్రాంతి తీసుకోవడానికి మంచి రోజు. వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు ఎమోషనల్‌గా కొన్ని విషయాల పట్ల పట్టుదలగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త! పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. మీరు దేనినైనా గట్టిగా పట్టుకున్నా, అది చేజారిపోయే అవకాశం ఉంది. అందుకే, పరిస్థితులకు అనుగుణంగా మసలుకుంటూ ముందుకు సాగడం మంచిది
కుంభరాశి
ధనిష్టా (3,4 పాదాలు),
శతభిషం (4),
పూర్వాభాద్ర (1, 2, 3పాదాలు)
ఈ రోజు మీరు అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. స్నేహితులు, ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్త దుస్తులు, ధనలాభం కలిగి ఆనందంగా ఉంటారు. మీ వ్యక్తిగత సంభాషణలు అర్ధవంతంగా సాగి, మంచి ఫలితాలనిస్తాయి. అయితే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.
మీనరాశి
పూర్వాభాద్ర (4పాదాలు),
ఉత్తరాభాద్ర(4),
రేవతి (4)
ఈ రోజుఆర్థికంగా మామూలు లాభాలే కనిపిస్తున్నాయి. కానీ మనసులో కొంచెం నిరాశ, పరువు నష్టం, చేపట్టిన పనుల్లో అడ్డంకులు, ఖర్చులు, వివాదాలు వంటివి ఎదురవ్వచ్చు. భౌతిక వస్తువులపై అతిగా ఆశ, భావోద్వేగాలకు లోను కావడం వంటివి జరగవచ్చు. ఖర్చులు చేయడానికి ఇది అంత మంచి సమయం కాదు.
రోజువారి రాశిఫలాలు ప్రతిరోజు మీరు నివసిస్తున్న ప్రదేశపు సూర్యోదయ సమయానికి అప్డేట్ అవుతాయి. రేపటి రాశి ఫలాల కొరకు ఈ పేజిని రేపు మళ్లీ సందర్శించండి. ప్రతిరోజు రాశి ఫలాలు చదవటానికి ఈ పేజ్ ని బుక్ మార్క్ చేసుకొండి (Ctrl+D) లేదా మీ ఫేస్ బుక్, వాట్సప్ మొదలైన వాటిలో షేర్ చేయండి. ఇవి సూచనలు మాత్రమే అని గమనించగలరు. ఇవి వ్యక్తిగత ఫలితాలు కావు.
Free Astrology
Newborn Astrology, Rashi, Nakshatra, Name letters
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in English, Hindi, Telugu, Kannada, Marathi, Gujarati, Tamil, Malayalam, Bengali, and Punjabi, French, Russian, and German. Languages. Click on the desired language name to get your child's horoscope.
Marriage Matching with date of birth
If you are looking for a perfect like partner, and checking many matches, but unable to decide who is the right one, and who is incompatible. Take the help of Vedic Astrology to find the perfect life partner. Before taking life's most important decision, have a look at our free marriage matching service. We have developed free online marriage matching software in Telugu, English, Hindi, Kannada, Marathi, Bengali, Gujarati, Punjabi, Tamil, Русский, and Deutsch . Click on the desired language to know who is your perfect life partner.