ప్రస్తుత పంచాంగం మరియు గ్రహస్థితితో కూడిన తత్కాల ప్రశ్నా కుండలి
చోర ప్రశ్న, వస్తు ప్రశ్న మరియు తత్కాల ప్రశ్నా కుండలిల కొరకు
జ్యోతిషశాస్త్రంలో, ప్రశ్నా జ్యోతిషం లేదా హోరరీ ఆస్ట్రాలజీ ఒక ముఖ్యమైన విభాగం. దీనిని ఛప్పన్న శాస్త్రం అని కూడా అంటారు. ప్రశ్న యొక్క ప్రాముఖ్యత గ్రహ స్థానం మరియు పృచ్ఛకుడు ప్రశ్న అడిగిన సమయంలో ఉన్న గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కలుగుతుంది. ఏదైనా వస్తువు కోల్పోయినా, ఏవరైనా మనుషులు కనిపించకుండా పోయినా, ఈ ప్రశ్నాకుండలి ఆధారంగా సమాధానాన్ని కనుగొనవచ్చు. పోయిన వస్తువు కానీ, మనిషి కాని దొరకటం సాధ్యమేనా, మరియు అలా అయితే, ఏ దిశలో వారు ఉన్నారు? ఎప్పుడు దొరకవచ్చు మొదలైన ప్రశ్నలకు సమాధానం ప్రశ్నాజ్యోతిషం చెపుతుంది. అంతే కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ప్రశ్నా జ్యోతిషం మీద ఆధారపడవచ్చు. ఈ తత్కాలిక ప్రశ్నా కుండలి లేదా ప్రస్తుత ప్రశ్నా కుండలి ప్రస్తుతం మీరున్న ప్రదేశం మరియు సమయం ఆధారంగా వేయబడినది. దీని ద్వారా నిపుణులైన జ్యోతిష్కులు సుళువుగా సమాధానం చెప్తారు.
వేల సంవత్సరాల నుంచి ప్రజలకు సరైన మార్గాన్ని చూపిస్తున్న జ్యోతిష్యం ప్రపంచవ్యాప్తంగా చాలామంది దినచర్యలో ఒక భాగం అయింది. పొద్దున్నే పంచాంగం కానీ రాశి ఫలాలు కానీ చూసుకోవడం అలాగే పిల్లలు పుట్టగానే జాతకాలు రాయించడం, పెళ్లిళ్లకి, సంతానానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి ఇలా ఒక విషయం అని కాకుండా జ్యోతిష్యం సమాధానం చెప్పని మార్గం చూపని అంశం అంటూ ఏదీ లేదు. ఒకరి జాతకం చూడాలంటే వారి పుట్టిన తేదీ, సమయం, మరియు పుట్టిన స్థలం అవసరం అవుతాయి. ఈ వివరాల ద్వారా ఆ రోజుకు ఆ సమయానికి ఉన్న గ్రహస్థితి ఆధారంగా జాతకం చూడటం ప్రధానంగా జరిగే అంశం. అయితే కొన్నిసార్లు మనం ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవడంలో కానీ లేదా ఒక పనిని చేయడంలో విజయం వస్తుందా రాదా తెలుసుకోవడం లాంటిది జన్మ జాతకం ద్వారా చూడడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి జ్యోతిషంలో ప్రశ్నా జ్యోతిషం అనే శాఖ ఉన్నది. దీని ద్వారా ఒక పని విజయవంతం అవుతుందా కాదా, పోయిన వస్తువు దొరుకుతుందా దొరకదా ఒకవేళ దొరికితే ఏ దిశలో వెతకాలి మరియు ఎంత సమయంలో దొరుకుతుంది మొదలైన ప్రశ్నలకు ప్రశ్న జ్యోతిష్యం ద్వారా సమాధానం తెలుసుకోవచ్చు. ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా పృచ్ఛకుడు ప్రశ్న అడిగిన సమయానికి ఉన్న గ్రహస్థితి ద్వారా లగ్నకుండలి వేసి ఆ కుండలిలో ఉన్న గ్రహాలను బట్టి జ్యోతిష్యులు సమాధానం చెప్తారు. లగ్నాధిపతి స్థితి, చంద్రుడి స్థితి, లాభాధిపతి స్థితి మొదలైన వాటిని లెక్కలోకి తీసుకొని సమాధానం చెప్తారు. ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా చెప్పే సమాధానం అత్యధికమైన సార్లు కచ్చితంగా ఫలిస్తుంది.
Free Astrology
Star Match or Astakoota Marriage Matching
Want to find a good partner? Not sure who is the right match? Try Vedic Astrology! Our Star Matching service helps you find the perfect partner. You don't need your birth details, just your Rashi and Nakshatra. Try our free Star Match service before you make this big decision! We have this service in many languages: English, Hindi, Telugu, Tamil, Malayalam, Kannada, Marathi, Bengali, Punjabi, Gujarati, French, Russian, and Deutsch Click on the language you want to see the report in.
Free Vedic Horoscope with predictions
Are you interested in knowing your future and improving it with the help of Vedic Astrology? Here is a free service for you. Get your Vedic birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, Yogas, doshas, remedies and many more. Click below to get your free horoscope.
Get your Vedic Horoscope or Janmakundali with detailed predictions in
English,
Hindi,
Marathi,
Telugu,
Bengali,
Gujarati,
Tamil,
Malayalam,
Punjabi,
Kannada,
Russian, and
German.
Click on the desired language name to get your free Vedic horoscope.