శని గోచారం - ఏల్నాటి శని ప్రభావం - పరిహారాలు
మీపై ఏల్నాటి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది.
జనవరి 17, 2023 న శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర, కుంభ, మీన రాశుల వారికి ఏల్నాటి శని సంచార ప్రభావం
శని భయపెడతాడా? లేక భయం పోగోడతాడా?
జనవరి 17, 2023 నుంచి శని కుంభరాశిలో సంచరిస్తాడు. ఈరోజు నుంచి మీన రాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది మరియు ధను రాశికి పూర్తవుతుంది. చాలామందికి ఏల్నాటి శని అంటే ఒకలాంటి భయం ఉంటుంది. శని ఏం చేస్తాడో, ఎన్ని కష్టాలు పెడతాడో అనే ఆలోచన వారికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయితే నిజంగా శని ఆ విధంగా కష్టపెడతాడా లేక మంచి చేస్తాడా అనేది ఒకసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం మకర కుంభరాశి వారికి అలాగే 17వ తారీకు నుంచి మీన రాశి వారికి ఏలినాటి శని ఉంటుంది. ఏలినాటి శని అంటే శని గోచారం మన రాశి నుంచి 12వ, ఒకటవ మరియు రెండవ స్థానంలో ఉండటం. ఈ మూడు స్థానాలకు ఇంత ప్రాధాన్యత ఉండటానికి కారణమేమిటంటే ఇవి మన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, మరియు జీవన విధానాన్ని సూచించేవి కావటం. ఒకటవ ఇల్లు మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మరియు మన జీవన విధానాన్ని సూచిస్తుంది. రెండవ ఇల్లు మన కుటుంబాన్ని మరియు ఆర్థిక స్థితిని సూచిస్తుంది. 12వ ఇల్లు మన ఖర్చులను, ఆరోగ్య సమస్యలను మరియు స్వయంకృతాపరాధాలను సూచిస్తుంది. ఈ స్థానాల్లో కర్మ కారకుడైన శని సంచరించడం వలన ఆయా స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఆ వ్యక్తులు అనుభవిస్తారు. నిజానికి శని ఇచ్చేది కష్టంలో కనిపించినప్పటికీ అది మనలో ఉన్న లోపాలను, మనం మనం చేసిన పురాకృత కర్మను తొలగించేది తప్ప మనం ఇబ్బందులకు గురిచేసేది కాదు. శని గోచారం ఈ మూడింటిలోని కాకుండా, నాలుగవ ఇంటిలో, మరియు ఎనిమిదో ఇంటిలో కూడా చెడు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వాక్యం. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. ఇది మిగిలిన గ్రహాల కంటే ఎక్కువ సమయం ఒక రాశిలో ఉంటుంది కాబట్టి మన జీవితంలో శని గోచారానికి అందుకే అంత ప్రాధాన్యత ఉంటుంది. శని మనం చేసే పనికి, మన వృత్తికి, మన కర్మకు కారకుడు. జాతకంలో శని అనుకూలంగా ఉంటే ఆ జాతకుడి జీవితం బాగుంటుంది. అంటే ఆ వ్యక్తి ఏ పనైనా సక్రమంగా చేస్తాడు. శని జాతకంలో బాగున్న వ్యక్తి బద్ధకానికి, వాయిదా వేసే స్వభావానికి దూరంగా ఉంటాడు. ఏ పని అయినా సమయానుసారం చేస్తాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతి సాధిస్తాడు. శని ఆలోచనలకంటే కూడా పనికి ప్రాధాన్యత ఇచ్చే గ్రహం. అందుకే మన ఆలోచనలకు కారకుడైన చంద్రుడు, మన అహంకారానికి అధికారానికి కారకుడైన సూర్యుడు శత్రులయ్యారు. జాతకంలో శని బాగాలేకుంటే ఆ వ్యక్తి బద్ధకస్తులుగా, చెడు పనులు చేసే వాడిగా మరియు పని మధ్యలో మానేసే వాడిగా ఉంటాడు. దాని కారణంగా జీవితంలో అభివృద్ధి తొందరగా జరగదు. మనం సరిగా అర్థం చేసుకుంటే శని ఇచ్చే ఫలితాలు మన జీవితాన్ని అభివృద్ధిపరిచేవే తప్ప, నష్టపరిచేవి కావని అర్థమవుతుంది.
12వ ఇంటిలో శని సంచార ప్రభావం
ఏలినాటి శని సమయంలో, శని 12వ ఇంటిలో ఉన్నప్పుడు మనకు ఖర్చులు పెరుగుతాయి. అయితే శని గోచారం 11 ఇంట్లో ఉన్నప్పుడు మనం డబ్బు సంపాదించడానికి చెడు మార్గాలు ఎంచుకోవడం లేదా అన్యాయంగా ఇతర డబ్బును, ఆస్తులను ఆక్రమించుకోవడం చేసినప్పుడు మాత్రమే శని గోచారం 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అన్యాయంగా సంపాదించిన డబ్బు ఖర్చవుతుంది. అంతేకాకుండా మనలో డబ్బు ఖర్చు చేయని పిసినారితనం ఉన్న ఈ సమయంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావటంతో మనలో ఉన్న ఆ లోపం తొలగిపోతుంది. దాని కారణంగా భవిష్యత్తులో మనకు ఆర్థికంగా మరియు శారీరకంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. శని 12వ ఇంటిలో ఉన్న సమయంలో డబ్బు ఖర్చు విషయంలో అహంకారానికి పోవటం, లేదా విలాసాల కారణంగా ఖర్చు చేయడం తగ్గించుకోవడం మంచిది. గతంలో విలాసాల కొరకు అధికంగా డబ్బు ఖర్చు చేసేవారు ఈ సమయంలో డబ్బు అందకపోవడం వలన ఆ లోపాన్ని తగ్గించుకోవడం కాకుండా, డబ్బు విలువ తెలుసుకోగలుగుతారు. శని మనం సంపాదించిన డబ్బునే ఖర్చు చేసేలా చేస్తాడు తప్ప అప్పలను అప్పులపాలు చేయడు. ఈ సమయంలో శని ప్రభావం తగ్గించుకోవాలంటే మనం అవసరమైన వారికి కొంత డబ్బు దానం చేయటం అలాగే శారీరకంగా కూడా అవసరమైన వారికి సాయం చేయడం వలన శని ఇచ్చే ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక స్థితి కూడా మెరుగు పడుతుంది.
1వ ఇంటిలో శని సంచార ప్రభావం
శని గోచారం ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు మనలో మానసికంగా మరియు శారీరకంగా ఉండే లోపాలు తొలగిపోతాయి. మనలో ఉండే బద్ధకం కానీ, మనపై మనకు ఉండే అతి ప్రేమ కానీ, స్వార్థం కానీ ఈ సమయంలో దూరమవుతాయి. శని ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు మనం చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనం బద్దకంగా ఉండడం కానీ, నిర్లక్ష్యంగా పనిచేయడం వలన కానీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మన ఆలోచనలు కూడా మనం నియంత్రించుకోవడం మంచిది. ఈ సమయంలో వృత్తిలో కానీ, మనం చేసే పనిలో కానీ బాధ్యతలు పెరగటం వలన మనలో ఉండే అజాగ్రత్త మరియు నిర్లక్ష్య ధోరణి దూరమవుతాయి. ఈ సమయంలో శని ఇచ్చే చెడు పలితాలు తగ్గడానికి మీరు బద్దకాన్ని వదిలేయటం, మరియు ఏ పనైనా పూర్తి బాధ్యతతో, ఏకాగ్రతతో పూర్తి చేయడం చేయాలి. మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉద్యోగంలో మార్పులు జరగటం లేదా అనుకోని సమస్యలు రావడం జరుగుతుంది. మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ సమయంలో శని ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు.
2వ ఇంటిలో శని సంచార ప్రభావం
రెండవ ఇంటిలో శని సంచారం చేసేటప్పుడు మన కుటుంబ విషయాల్లో మరియు ఆర్థిక విషయాల్లో మనకు సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యలు మన మన కుటుంబానికి మరింత దగ్గరయ్యేలా చేస్తాయి తప్ప వారికి మనను దూరం చేయవు. కుటుంబం పట్ల మనలో ఉండే అతి జాగ్రత్త కానీ, అతి ప్రేమ కానీ ఈ సమయంలో తగ్గడమే కాకుండా మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మీరు మీ బాధ్యతలు నిర్వర్తించేలా చేస్తుంది. మీరు బాధ్యతలను తప్పించుకునే వారైతే లేదా మీ కుటుంబం పట్ల ప్రేమ కంటే ఎక్కువ వారిపై అధికారం చెలాయించాలని మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే మీపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను నిజాయితీ నిర్వర్తించే వారైతే మీపై శని ప్రభావం ఏమాత్రం ఉండదు. రెండవ ఇంట్లో శని సంచారం ఆర్థికంగా మీలో ఉండే లోపాలను తొలగించి మిమ్మల్ని ఆర్థికంగా పటిష్టంగా చేస్తుంది. ఈ సమయంలో మీరు అతిగా పొదుపు చేయటం కానీ, అవసరానికి తగిన విధంగా డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం కానీ చేస్తే అది మీకు ఖర్చులను పెంచుతుంది. అలాకాకుండా మీ కుటుంబం కొరకు కానీ, అవసరాల కొరకు గాని తగినంత విధంగా డబ్బు ఖర్చు చేస్తే అది మీకు మరింత డబ్బునిస్తుంది తప్ప నష్టాలనివ్వదు.
శని ఇచ్చే ఫలితం ఏదైనా ఆ సమయంలో మన కష్టంలా అనిపించినా, భవిష్యత్తులో మన అభివృద్ధికి అది దోహదపడేదే తప్ప మనకు చెడు చేసేది కాదు. శనిగోచారం సరిగా లేనప్పుడు మనంతట మనం శారీరకంగా కష్టపడటం, ఇతరులకు సహాయం చేయటం మరియు అవసరమైన వారికి ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ సాయపడితే శని మనకు ఇచ్చే కష్టం తగ్గుతుంది.
Astrology Articles
జాతకంలో చంద్రుని ప్రభావం, పరిష్కారాలు New
Explore the impact of the Moon in your horoscope and remedies to balance it.
Read more♈ మేష రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Unlock your fiery potential with insights into Aries traits, strengths, and challenges.
Read more♉ వృషభ రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Discover the grounded and sensual nature of Taurus with its traits and challenges.
Read more♊ మిథున రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Understand your dual nature with insights into Gemini traits, strengths, and challenges.
Read more♋ కర్కాటక రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Embrace your nurturing side with insights into Cancer traits, strengths, and challenges.
Read more♌ సింహ రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Unleash your leadership potential with insights into Leo traits, strengths, and challenges.
Read more♍ కన్యా రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Navigate your perfectionist tendencies with insights into Virgo traits, strengths, and challenges.
Read more♎ తులా రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Seek balance and harmony with insights into Libra traits, strengths, and challenges.
Read more♏ వృశ్చిక రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Embrace your transformative power with insights into Scorpio traits, strengths, and challenges.
Read more♐ ధనుస్సు రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Unveil your adventurous spirit with insights into Sagittarius traits, strengths, and challenges.
Read more♑ మకర రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Achieve your goals with insights into Capricorn traits, strengths, and challenges.
Read more♒ కుంభ రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Embrace your uniqueness with insights into Aquarius traits, strengths, and challenges.
Read more♓ మీన రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New
Dive into your empathetic nature with insights into Pisces traits, strengths, and challenges.
Read moreరక్షాబంధనం 2024: ఏ సమయంలో రాఖీ కట్టించుకోవాలి? New
Find out the auspicious time to tie Rakhi in 2024.
Read more♈ Aries Moon sign: Complete information New
Explore Aries: The Mystical Fire Sign in Vedic Astrology.
Read more♉ Taurus Moon sign: Complete information New
Discover Taurus: The Earthy Zodiac Sign in Vedic Astrology.
Read more♊ Gemini Moon sign: Complete information New
Unveil Gemini: The Airy Twin Sign in Vedic Astrology.
Read more♋ Cancer Moon sign: Complete information New
Dive into Cancer: The Watery Nurturer in Vedic Astrology.
Read more♌ Leo Moon sign: Complete information New
Learn About Leo: The Fiery Leader in Vedic Astrology.
Read more♍ Virgo Moon sign: Complete information New
Understand Virgo: The Earthy Analyst in Vedic Astrology.
Read more♎ Libra Moon sign: Complete information New
Explore Libra: The Airy Balancer in Vedic Astrology.
Read more♏ Scorpio Moon sign: Complete information New
Discover Scorpio: The Watery Transformer in Vedic Astrology.
Read more♐ Sagittarius Moon sign: Complete information New
Unveil Sagittarius: The Fiery Adventurer in Vedic Astrology.
Read more♑ Capricorn Moon sign: Complete information New
Learn About Capricorn: The Earthy Climber in Vedic Astrology.
Read more♒ Aquarius Moon sign: Complete information New
Discover Aquarius: The Airy Innovator in Vedic Astrology.
Read more♓ Pisces Moon sign: Complete information New
Dive into Pisces: The Watery Dreamer in Vedic Astrology.
Read moreKnow your Rashi and Nakshatra with name New
Discover your Rashi and Nakshatra by name in various languages.
Read moreGeneral Articles
English Articles
Free Astrology
Free Daily panchang with day guide
Are you searching for a detailed Panchang or a daily guide with good and bad timings, do's, and don'ts? Our daily Panchang service is just what you need! Get extensive details such as Rahu Kaal, Gulika Kaal, Yamaganda Kaal, Choghadiya times, day divisions, Hora times, Lagna times, and Shubha, Ashubha, and Pushkaramsha times. You will also find information on Tarabalam, Chandrabalam, Ghata day, daily Puja/Havan details, journey guides, and much more.
This Panchang service is offered in 10 languages. Click on the names of the languages below to view the Panchang in your preferred language.
English,
Hindi,
Marathi,
Telugu,
Bengali,
Gujarati,
Tamil,
Malayalam,
Punjabi,
Kannada,
French,
Russian, and
German.
Click on the desired language name to get your free Daily Panchang.
Marriage Matching with date of birth
If you are looking for a perfect like partner, and checking many matches, but unable to decide who is the right one, and who is incompatible. Take the help of Vedic Astrology to find the perfect life partner. Before taking life's most important decision, have a look at our free marriage matching service. We have developed free online marriage matching software in Telugu, English, Hindi, Kannada, Marathi, Bengali, Gujarati, Punjabi, Tamil, Русский, and Deutsch . Click on the desired language to know who is your perfect life partner.