రక్షాబంధనం (రాఖీ) ఏ సమయంలో చేయాలి?
రాఖీ ఎప్పుడు కట్టించుకోవాలి.
రక్షాబంధనం లేదా రాఖీ పండుగ, భారతీయ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైన పండుగ. ఇది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు, ఇందులో సోదరులు తమ సోదరీమణులకు రాఖీ కట్టి, వారి భద్రత, సంతోషం కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగను సరిగ్గా, శాస్త్రాలను అనుసరించి జరుపుకోవడం చాలా ముఖ్యమైంది. అందువల్ల, రాఖీ కట్టించుకోవడానికి సరైన సమయం ఏదో తెలుసుకోవడానికి, ఈ పండుగను ఎప్పుడు, ఎలాంటి సమయంలో జరుపుకోవాలో మనం వివరంగా తెలుసుకోవాలి. 2024 సంవత్సరానికి సంబంధించి, ఈ పండుగను జరుపుకోవడానికి అపరాహ్ణం మరియు ప్రదోష సమయాలు ఏవో వివరంగా ఇక్కడ అందించాము.
रक्षाबंधनम् - श्रावणपूर्णिमायां भद्रारहितायां त्रिमुहूर्ताधिकोदयव्यापिन्यामपराह्ने प्रदोषे वा कार्यम् । इदं ग्रहणसंक्रांतिदिनेपि कर्तव्यम् ।
అనే శాస్త్ర వాక్యాన్ని అనుసరించి ఏ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున అపరాహ్ణం లేదా ప్రదోష సమయంలో రాఖీ (రక్షాబంధనం) కట్టించుకోవాలి. దానికి సూర్యోదయం నుండి ఆరు ఘడియల (2 గంటల 24 నిమిషములు) కంటే ఎక్కువ సమయం గడిచి, భద్ర కరణం లేని పౌర్ణమి సమయాన్ని తీసుకోవాలి. ఆ రోజున గ్రహణం లేదా సంక్రాంతి ఉన్నప్పటికీ రక్షాబంధనం చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు.
ఈ సంవత్సరం (2024) ఆగష్టు 19 సోమవారం, శ్రావణ పౌర్ణమి రోజున భద్ర కరణం మ. 01గం. 33ని.ల వరకు ఉన్నది. కాబట్టి పైన చెప్పిన నియమం ప్రకారం అపరాహ్న సమయం మధ్యాహ్నం 01:35 PM నుంచి 04:06 PM మధ్యలో లేదా ప్రదోష సమయం సాయంత్రం 05:48 PM నుంచి 07:24 PM మధ్యలో రక్షాబంధనం చేసుకోవచ్చు. అపరాహ్న సమయం మరియు ప్రదోష కాలం స్థానిక సూర్యోదయ, అస్తమయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ప్రాంతంలో ఈ సమయాలు తెలుసుకోవటానికి మీ ప్రాంత అపరాహ్న సమయం మరియు ప్రదోష సమయం తెలుసుకొండి ను సందర్శించండి.