తొలి తెలుగు జ్యోతిష వెబ్ సైట్ ఆన్ లైన జ్యోతిష్ డాట్ కాం కు స్వాగతం తొలి తెలుగు జ్యోతిష వెబ్ సైట్ ఆన్ లైన్ జ్యోతిష్.కాం కు స్వాగతం. తెలుగు - ఇంగ్లీష్ భాషలలో జన్మకుండలి, ప్రశ్నాజ్యోతిషం, ముహూర్తము, గుణమేళనం, పంచాంగము, జన్మసమయ నిర్ధారణ, గ్రహ దోష పరిహారములు, పూజలు, హోమములు మొదలైన జ్యోతిష సేవలను అందించే తొలి తెలుగు జ్యోతిష వెబ్ సైట్ #1 Telugu Astrology Portal
బుధవారం, 8  అక్టోబర్2008       
సర్వధారి ఫలితాలు:


సర్వధారి నామ సంవత్సరంలో దేశ, రాష్ట్ర రాజకీయలను ప్రభావితం చేయబోతున్న ప్రముఖుల గురించి ఒక విశ్లేషణ:
(
జ్యోతిష శాస్త్ర ప్రకారం, నా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ విశ్లేషణ ఇస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా భావించవద్దు.  ఏవైనా సందేహాలున్నచో మీ ప్రశ్నలను అభిప్రాయాలను దయచేసి నాకు మెయిల్ ద్వారా పంపించండి.)

1. చిరంజీవి
2.కె. చంద్రశేఖర్ రావ్(K.C.R)
3. Y. S. రాజశేఖర్ రెడ్డి
4. నారా చంద్రబాబు నాయుడు
5. బాలకృష్ణ
6. రజనీకాంత్
7. సోనియాగాంధీ
8. L.K.అద్వాని
9. రాహుల్ గాంధీ
 

ముందుగా సర్వధారి సంవత్సరంలో జరగబోయే ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఈ సంవత్సర గోచారాన్ని పరిశిలించినట్లయితే ఎప్రీల్ చివరలో రాహు, కేతువులు, నవంబర్ మొదటి వారంలో గురువు రాశులు మారుతున్నారు. ఇది దేశ, రాష్ట్ర రాజకీయాలపై అధిక ప్రభావాన్ని చూపిస్చుంది. 
ఎప్రీల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో రాజకీయంగా కొత్త సమీకరణాలు, కొత్త పార్టీల ఆవిర్భావం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు పార్టీ ఫిరాయింపుల కారణంగా కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశమున్నది. నవంబర్ తరువాత మకరంలో గురు, రాహువుల సంచారం, శని పై గురు ప్రభావం లేకుండటం వలన దళితులు, నిమ్న వర్గాల వారికి ఈ సంవత్సరం ఎంతగానో అనుకూలిస్తుంది. సామాజికంగా, రాజకీయంగా వారు ఒక మెట్టు ఎక్కే అవకాశమున్నది. అయితే చాల రాజకీయ పార్టీలు వీరి పేరు చెప్పుకొని తమ పబ్బం గడుపుకుంటాయి.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ సంవత్సరం పెనుమార్పులు జరిగే అవకాశమున్నది. కొత్త రాజకీయ పార్టీలు, సమీకరణాల కారణంగా రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు జరుగుతాయి. సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు దిగ్గజాలు రాజకీయాల్లో ప్రవేశిస్తారు. జనవరి తర్వాత నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పలు విప్లవాత్మక సంఘటనలు చోటుచేసుకుంటాయి.

ఇప్పుడు ఆయా ప్రముఖుల వ్యక్తిగత జాతక పరిశీలన చేద్దాం.

1. చిరంజీవి: చిత్తా నక్షత్రం, కన్యారాశిలో జన్మించిన చిరంజీవి గారికి ఈ సంవత్సరం రాజకీయంగా కొత్త జీవితాన్ని ఇస్తుంది. మే తర్వాత నుంచి చిరంజీవి ప్రత్యక్ష రాజకీయ జీవితం ఆరంభమవుతుంది. నవంబర్ నుంచి మారనున్న గురు గోచారం చిరంజీవికి అనుకూలించి నప్పటికీ, ఒత్తిడులను తట్టుకోగలగటం, మొహమాటానికి పోకుండా నిక్కచ్చిగా ఉండటం మొదలైనవి అలవాటు చేసుకో గలిగితే రాజకీయంగా మంచి అభివృద్ది సాధించ వచ్చు.


2. కె. చంద్రశేఖర్ రావ్: ఆశ్లేషా నక్షత్రం, కర్కాటక రాశి లో జన్మించిన కెసిఆర్ గారికి ఈ సంవత్సరం ప్రథమార్దం కంటే ద్వితియార్దం ఎక్కువగా అనుకూలిస్తుంది. ఎదుటి వారిని తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకునే K.C.R. గారు వాక్ స్థానంలో శని సంచారం కారణంగా తొందరపడి మాట జారకుండా జాగ్రత్త వహించాలి. నవంబర్ నుంచి  రాష్ట్ర రాజకీయాల్ని అత్యధికంగా ప్రభావితం చేయగలుగుతారు.
 

3. Y.S. రాజశేఖర్ రెడ్డి: మూలా నక్షత్రం, ధనుస్సు రాశిలో జన్మించిన రాజశేఖర్ రెడ్డి గారికి ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. అయితే రాశ్యాధిపతి నీచ స్థానంలో సంచరించటం వలన అంతర్గత ఒత్తిడులు, ప్రతిష్టను భంగ పరిచే సంఘటనలు చోటుచేసుకునే అవకాశమున్నది. రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది.

4. నారా చంద్రబాబు నాయుడు: హస్తా నక్షత్రం, కన్యా రాశిలో జన్మించిన చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం నవంబర్ నుంచి అనుకూల సమయం. చాలా కాలం తర్వాత పార్టీపరంగా, వ్యక్తిగతంగా ప్రతిష్ట పెరగటం, సీనియర్ల, ప్రముఖుల తోడ్పాటు లభించటం వలన కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5. నందమూరి బాలకృష్ణ: మూలా నక్షత్రం, ధనుస్సు రాశిలో జన్మించిన బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. డిశంబర్-జనవరి ప్రాంతంలో రాజకీయ ప్రవేశం చేసే అవకాశమున్నది.

6. రజనీకాంత్: ఆంధ్రప్రదేశ్ లో లాగానే తమిళనాడులో రజనీకాంత్ ఈ సంవత్సరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రవణా నక్షత్రం, మకర రాశిలో జన్మించిన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం అనుకూలిస్తుంది.

ఇక దేశ రాజకీయాల్లోకి వస్తే సోనియా, రాహుల్ మరియు L. K. అద్వానీలకు ఈ సంవత్సరం రాజకీయంగా అనుకూలిస్తుంది.

దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. సినిమా, క్రీడా రంగాలకు చెందిన చాలామంది రాజకీయాల్లో చేరటం జరుగుతుంది.

మీ అభిప్రాయాలను myjyotishi-at-yahoo.co.in కు పంపించండి.